సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పరిషత్‌ ఎన్నికల తుది ఫలితాలు విడుదల

1 గంట క్రితం

Municipal election counting underway Alliance in the lead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 07:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల వారీగా పార్టీల గెలుపు వివరాలు ప్రకటించిన ఎస్‌ఈసీ

ప్రజాశక్తి-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,768 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన పార్టీలు, అభ్యర్థుల వారీగా గెలుపు వివరాలను వెల్లడించింది.

జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 406 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ 76, జనసేన 73, బీజేపీ 20 స్థానాలను గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు ఆరు స్థానాల్లో, సీపీఎం ఒక స్థానంలో విజయం సాధించారు.

ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 4,806 చోట్ల గెలుపొందింది. వైసీపీ 1,711, జనసేన 938, బీజేపీ 117 స్థానాలను దక్కించుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 169 స్థానాల్లో విజయం సాధించగా.. సీపీఎం 15, కాంగ్రెస్‌ 9, బీఎస్పీ 3 స్థానాల్లో గెలుపొందినట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది.

జడ్పీటీసీ స్థానాల వారీగా పార్టీల గెలుపు
7B - ZPTCs.jpg

ఎంపీటీసీ స్థానాల వారీగా పార్టీల గెలుపు

7A - MPTCs.jpg

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్