సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం..

1 గంట క్రితం

fire.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 07:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌: నగరంలో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపాయి. కూకట్‌పల్లిలోని ఆస్బెస్టాస్‌ కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పేపర్‌ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో చెలరేగిన మంటలు సమీపంలోని నెయ్యి, కుర్‌కురే, హల్దీరామ్‌ ఉత్పత్తుల నిల్వ గోదాములకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.

నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బేగంబజార్‌లోని ఓ భవనంపై బాణసంచా నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. జీడిమెట్లలోని ఓ స్క్రాప్‌ దుకాణంలో బాణసంచా కారణంగా మంటలు వ్యాపించి షాపు పూర్తిగా దగ్ధమైంది. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓల్డ్‌ విలేజ్‌లో డెకరేషన్‌ గోదాములో, సికింద్రాబాద్‌ బండిమెట్‌లోని డిస్ట్రిబ్యూటర్‌ డ్రగ్‌మార్ట్‌లోనూ అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో లక్షలాది రూపాయల విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్