సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

18 నిమిషాల క్రితం

fire acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 09:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మృతుల్లో రెండు నెలల పసికందు

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కట్నీ జిల్లా బర్హీ పట్టణంలోని ఓ బాణసంచా దుకాణంలో మంటలు చెలరేగి మూడు అంతస్తుల భవనానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రెండు నెలల పసికందు కూడా ఉన్నట్లు సమాచారం. భవనమంతా మంటలు వ్యాపించడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో అధికారులు జేసీబీ సహాయంతో భవనం గోడను కూల్చి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్