మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం

13 జులై, 2026

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 08:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఉంగుటూరు (ఏలూరు జిల్లా) : జాతీయ రహదారి నారాయణపురం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడగా వారిలో ఒకరికి తలకు తీవ్రగాయం అయింది. గణపవరం నుంచి జాతీయ రహదారి వైపు వస్తున్న లారీ మలుపు తిరుగుతున్న ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఉంగుటూరు మండలం రావులపర్రుకు చెందిన తాడిశెట్టి దుర్గాప్రసాద్‌, దోనాద్రి కాశీలు గాయపడగా వారిలో కాశీ తలకు తీవ్రగాయమయింది. హైవే పోలీసు ప్రెటోలింగు వాహనంలో క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్త తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్