ప్రజాశక్తి-నూజివీడు టౌన్ (ఏలూరు) : సొంత పొలంలో వరి నాట్లు వేస్తుండగా పాము కాటుకు గురై రైతు శుక్రవారం మృతి చెందిన విషాద సంఘటన నూజివీడు మండలం తుక్కులూరు లో చోటుచేసుకుంది. వరి నాట్లు వేస్తుండగా రైతు గుండుబోయిన వెంకట లక్ష్మణరావు (52) ను విష సర్పం కాటు వేయడం జరిగింది. సమీపంలోనివారు గమనించి హుటాహుటిన నూజివీడు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రైతు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు, మృతుడు మొద్దులు చెరువు నీటి సంఘం ప్రెసిడెంట్. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.
పాము కాటుకు గురై రైతు మృతి
31 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 31, 2026, 12:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)