ప్రజాశక్తి–ఏలూరు స్పోర్ట్స్: ఏలూరు నగరానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ పేరూరి శ్రీనివాసరావు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆయన కోర్టు మోటర్ రింగ్ సెల్‌కు అటాచ్ అయి విధులు నిర్వహిస్తున్నారు. పేరూరి శ్రీనివాసరావు గతంలో పెదవేగి, ఏలూరు, చేబ్రోలు తదితర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు. ఏలూరు సర్వజన ఆస్పత్రి వైద్యులు మృతిని ధ్రువీకరించారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని ఏలూరులోని ఆయన స్వగృహానికి తరలించి, బంధువులు, స్నేహితులు, సహచరులు సందర్శించేందుకు ఉంచారు. ఆయన మృతి పట్ల పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)