టి.నరసాపురం (ఏలూరు) : మండలంలోని సాయంపాలెం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. గ్రామంలో చెట్టు నరుకుతుండగా చెట్టుకొమ్మ విద్యుత్ స్తంభంపై పడినట్లు తెలుస్తోంది. దీంతో విద్యుత్ స్తంభం సమీపంలో ఉన్న వ్యక్తి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుడి పేరు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
చెట్టుకొమ్మ విద్యుత్ స్తంభంపై పడి వ్యక్తి మృతి
20 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 12:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)