పొలంలో జన్మదిన వేడుకలకు అనుమతి నిరాకరణ
ప్రజాశక్తి ఏలూరు సిటీ : ఇటీవల దెందులూరు ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన ప్రముఖ న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసరావు నివాసం వద్ద ఆదివారం పోలీసులు భారీగా మోహరించారు. ఆయన కుమారుడు ఈడుపుగంటి శ్రీరామ్ జన్మదినం సందర్భంగా వట్లూరు గ్రామంలోని వారి వ్యవసాయ పొలంలో వేడుకలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, సంబంధిత ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి సభలు, సమావేశాలు లేదా వేడుకలు నిర్వహించేందుకు అనుమతి లేదని కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా శ్రీనివాసరావు ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసులు లేదా ఈడుపుగంటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది








కామెంట్‌లు (0)