మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మూడు నెలలకే మళ్లీ గోతులు....ఆందోళనలో వాహనదారులు

02 ఆగస్టు, 2026

Potholes reappear after just three months... Motorists worried.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 04:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఉంగుటూరు (ఏలూరు) : ఫైల్‌ ‌నంబరు 2 నారాయణపురం - ఉండి ఆర్ ‌అండ్ బి రహదారి మార్గం మందలపర్రు- భువ్వనపల్లి దారి గోతులు ప్రమాదభరితంగా ఉన్నాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నారపల్లి రమణారావు ఆధ్వర్యంలో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారిలో గోతులు పడ్డాయని మరమ్మతులు చేయించాలని సీపీఎం నాయకులు ఎన్నో సార్లు పీజీఆర్‌ఎస్‌‌లో ఫిర్యాదులు చేయగా ఆర్ ‌అండ్ ‌‌బి అధికారులు తూతూ మంత్రంగా గోతులను పూడ్చారు. కాని మూడు నెలల అవ్వకుండానే గుంతలు ఏర్పడ్డాయి. వర్షంనీరు చేరడంతో ద్విచక్రవాహనాలతో పాటు ఇతర వాహనాలు సైతం ప్రమాదాలబారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. గ్రామస్థులు, ద్విచక్రవాహనదారులు గోతుల వద్ద కొద్దిసేపు ఆందోళన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో కోన శ్రీనివాసరావు, వెలగలేటి మోహన, కానూరు రాజు, సంకు కోటి, లావేటి సోంబాబు, కోసూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్