ప్రజాశక్తి-అమరావతి : రొయ్యల మేత ధరల పెంపును సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ జరిగే వరకు ఈ ఏడాది జూన్ 12న జారీ చేసిన సర్క్యులర్‌లో నిర్దేశించిన ధరలకే రొయ్యల మేతను విక్రయించాలని రొయ్యల మేత తయారీదారుల సంఘాన్ని ఆదేశించింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఉత్తర్వులిచ్చారు. వన్నామీ రకం మేతపై టన్నుకు రూ.9 వేలు, టైగర్ రకం మేతపై టన్నుకు రూ.12 వేలు పెంచుతూ రొయ్యల మేత తయారీదారుల సంఘం, అనుబంధ సంస్థలు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆక్వా రైతులు మల్లా తులసీరామ్, వెరవల్లి చంద్రశేఖర్ హైకోర్టును ఆశ్రయించారు.
Print Editionనిర్దేశించిన ధరలకే రొయ్యల మేత విక్రయం : హైకోర్టు ఆదేశం
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)