న్యూఢిల్లీ : లడఖ్ సివిల్ సొసైటీ గ్రూపులైన లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఎబి), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (కెడిఎ)లు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి కమిటీ మధ్య బుధవారం చర్చలు జరగనున్నాయి. కీలకమైన సామాజిక, మతపరమైన సంస్థలైన ఎల్‌ఎబి, కెడిఎలకు చెందిన అనేకమంది సభ్యులు మంగళవారానికి ఢిల్లీ చేరుకున్నారు. చర్చల పట్ల ఆశాభావంతో వున్నట్లు కెడిఎ సభ్యులు సజ్జార్ కార్గిలి వ్యాఖ్యానించారు. లడఖ్ ప్రాంత భూమిని, సంస్కృతిని, ఉద్యోగాలను, పర్యావరణాన్ని, గుర్తింపును కాపాడుకునేందుకు లడఖ్ ప్రాంతాన్ని ఆరవ షెడ్యూలులో చేర్చాలని లడఖ్ గ్రూపులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. మరిన్ని రాజకీయ, శాసనపరమైన అధికారాలు కావాలని, రాష్ట్ర ప్రతిపత్తిని వారు కోరుతున్నారు. విశ్వాస పునరుద్ధరణ పేరుతో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు తమని సంప్రదించకుండా తీసుకున్నారని, ప్రస్తుత చర్చల్లోనైనా తమని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నట్లు కార్గిలి తెలిపారు. రాష్ట్ర ప్రతిపత్తిని ఇచ్చేందుకు కేంద్రం నిరాకరిస్తోంది. అది దీర్ఘకాలిక లక్ష్యమని పేర్కొంటూ 371వ అధికరణ కింద ప్రత్యేక పాలనా మాడ్యూల్‌ను కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రత్యేక మాడ్యూల్ కింద పాలనా, ఆర్థిక, శాసనపరమైన అధికారాలతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తుంది.
లడఖ్, కేంద్రం మధ్య నేడు చర్చలు
48 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)