న్యూఢిల్లీ : జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల సమయంలో ఒక విద్యార్థి తండ్రిపై దాడి చేసిన కేసులో అరెస్టయిన సంఘ్‌పరివార్ ఉన్మాది స్వతంత్ర భరద్వాజ్‌కు ఢిల్లీ కోర్టు 14 రోజుల పోలీసు కస్టడీ విధించింది. సిజెపి ఆందోళనలతో స్వతంత్య భరద్వాజ్‌ను ఉత్తరప్రదేశ్‌లో ఢిల్లీ పోలీసులు ఈ నెల 4 అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న విధించిన ఒక రోజు కస్టడీ పూర్తికావడంతో సోమవారం మళ్లీ కోర్టు ముందు హాజరపర్చారు. పాటియాలా హౌస్ కోర్టుల అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ భరద్వాజ్‌కు మళ్లీ 14 రోజుల కస్టడీ విధిస్తూ ఉత్తర్వును జారీ చేశారు. మరో వైపు తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టును స్వతంత్ర భరద్వాజ్ ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ నవీన్ చావలా, జస్టిస్ రవీందర్ దుదేజాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
Print Editionస్వతంత్ర భరద్వాజ్‌కు 14 రోజుల కస్టడీ
43 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)