జమ్మూకాశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్ : దేశంలో మసీదుల కూల్చివేతలు, మైనార్టీలపై దాడులు దురదృష్టకరమని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. "ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ముస్లింలను బయటివారిగా, ఇతరులుగా చూస్తుండటం.. మసీదుల కూల్చివేత అయినా లేదా వారిపై దాడులైనా, రెండూ అత్యంత దురదృష్టకరం. ఇలా జరగకూడదు" అని అబ్దుల్లా స్పష్టం చేశారు. శ్రీనగర్‌లో సోమవారం జరిగిన మొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా మాట్లాడుతూ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో ఆయన ఇటీవల జరిపిన సమావేశం గురించి మాట్లాడుతూ "అనేక సమస్యలపై షాతో చర్చలు జరిగాయి" అని అబ్దుల్లా తెలిపారు.








కామెంట్‌లు (0)