సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.వీ.ఎస్. నారాయణ
ప్రజాశక్తి - చింతలపూడి : వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.వీ.ఎస్. నారాయణ డిమాండ్ చేశారు. చింతలపూడి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు చేపట్టిన నిరసన కార్యక్రమం 15వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని, నామినీలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారుతున్నా వీఆర్‌ఏల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వీఆర్‌ఏలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో వీఆర్‌ఏలు చేపట్టే ఉద్యమాలకు సీఐటీయూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు నత్త వెంకటేశ్వరరావు, వీఆర్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)