చేబ్రోలులో ఓటర్లకు ఇబ్బందులు
గంటసేపు క్యూలో నిలబడి వెనుదిరిగిన వృద్ధురాలు
ప్రజాశక్తి - ఉంగుటూరు: ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో వివరాలు సరిగా కనిపించక ఓటర్లు తికమక పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏ వార్డుకు సంబంధించిన ఓటర్లు ఎక్కడ ఓటు వేయాలో తెలిపే వివరాలు స్పష్టంగా లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒకటో వార్డులో ఓటు ఉన్న పలువురు వృద్ధులు తెలియక 13వ వార్డులోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి క్యూలో నిలబడ్డారు. గంటసేపు వేచి ఉన్న అనంతరం అక్కడ వారి ఓటు లేదని అధికారులు చెప్పడంతో నిరాశకు గురయ్యారు. దీంతో ఓ వృద్ధురాలు ఓటు వేయకుండానే వెనుదిరిగింది. ఇలాంటి ఘటనలు చేబ్రోలులో అనేకం చోటుచేసుకుంటున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు స్పష్టమైన సమాచారం అందించకపోవడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు.







కామెంట్‌లు (0)