ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇబ్రహీంబాద్‌లో పోలింగ్‌ సరళిని పరిశీలించిన ఎస్పీ

1 గంట క్రితం

ఇబ్రహీంబాద్‌లో పోలింగ్‌ సరళిని పరిశీలించిన ఎస్పీ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 08:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌ గ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సరళిని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి స్వయంగా పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూ లైన్ల నిర్వహణ, ఓటర్ల రాకపోకలు,నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. నిర్దేశిత ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని, పోలింగ్‌ కేంద్రాల పరిసరాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్