ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చీరాల మండలంలో కొనసాగుతున్న పంచాయతీ పోలింగ్‌

56 నిమిషాల క్రితం

చీరాల మండలంలో కొనసాగుతున్న పంచాయతీ పోలింగ్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 09:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు

  • పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు

ప్రజాశక్తి - చీరాల: చీరాల మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగనుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. చీరాల మండలంలోని విజయనగర కాలనీలో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఓటు వేస్తున్నారు. పోలింగ్‌ సమయం మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉండటంతో ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. చీరాల మండలంలో మొత్తం 15 పంచాయతీలకు గాను తోటవారిపాలెం, పిట్టువారిపాలెం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 13 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తమ పసిపిల్లలను వెంట తీసుకువచ్చి విధులు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్