ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టంగుటూరు ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి

26 నిమిషాల క్రితం

Horrific accident at Tanguturu toll plaza; five dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 09:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

ప్రజాశక్తి - అద్దంకి : ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌గేట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరొకరు గాయాలతో బయటపడినట్లు అధికారులు మంత్రికి వివరించారు. మృతులను అద్దంకి మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందినవారిగా గుర్తించినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్