ప్రజాశక్తి - జగ్గంపేట: మండల కేంద్రమైన జగ్గంపేటలో పోలింగ్ కేంద్రాల సమీపంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పార్టీ జెండాలు, గుర్తులతో ప్రచారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారం చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ ప్రచారం నిర్వహించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
జగ్గంపేటలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 29, 2026, 09:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)