ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉదయం 9 గంటల వరకు 29.15 శాతం పోలింగ్ నమోదు

33 నిమిషాల క్రితం

sitampeta.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 09:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వీరఘట్టంలో అత్యధికంగా 31.17 శాతం పోలింగ్

ప్రజాశక్తి-పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది ఆదివారం ఉదయం 9 గంటల సమయానికి నాలుగు మండలాల పరిధిలో 29.15 శాతం పోలింగ్ నమోదైంది మొత్తం 114 గ్రామ పంచాయతీల పరిధిలోని 855 పోలింగ్ కేంద్రాల్లో 1,40,189 మంది ఓటర్లకు గాను 40,864 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


మండలాల వారీగా వీరఘట్టం మండలంలో అత్యధికంగా 31.17 శాతం పోలింగ్ నమోదైంది ఇక్కడ 24 గ్రామ పంచాయతీల పరిధిలోని 206 పోలింగ్ కేంద్రాల్లో 40,810 మంది ఓటర్లకు గాను 12,719 మంది ఓటు వేశారు సీతంపేట మండలంలో 45 పంచాయతీల పరిధిలోని 259 పోలింగ్ కేంద్రాల్లో 39,526 మంది ఓటర్లకు గాను 11,571 మంది ఓటు వేయడంతో 29.27 శాతం పోలింగ్ నమోదైంది. పాలకొండ మండలంలో 26 గ్రామ పంచాయతీల పరిధిలోని 226 పోలింగ్ కేంద్రాల్లో 31,539 మంది ఓటర్లకు గాను 8,748 మంది ఓటు హక్కు వినియోగించు కోవడంతో 27.74 శాతం పోలింగ్ నమోదైంది భామిని మండలంలో 19 పంచాయతీల పరిధిలోని 164 పోలింగ్ కేంద్రాల్లో 28,314 మంది ఓటర్లకు గాను 7,826 మంది ఓటు వేయడంతో 27.64 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్