సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెంకటాద్రిపురంలో యువకుడు దారుణహత్య

17 గంటల క్రితం

Young man brutally murdered
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-నూజివీడు టౌన్ (ఏలూరు) : నూజివీడు మండలం వెంకటాద్రిపురంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో గొల్లపల్లి డానియల్ అనే వ్యక్తి కూచిపూడి రంగా అనే యువకుడి పై దాడి చేయటంతో ఘటనా స్థలంలోనే రంగా మృతి చెందటంతో గ్రామంలో విషాదం నెలకొంది. నిందితుడు డానియల్ తండ్రిని గతంలో రంగా హత్య చేసినట్లు సమాచారం ఉందని, దానికి ప్రతీకారంగానే నేడు రంగాని డేనియల్ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు నూజివీడు రూరల్ సిఐ ఐవి.నాగేంద్ర కుమార్ బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్