మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలవరం ప్రాజెక్టులో జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

22 మే, 2026

polavaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 22, 2026, 03:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఏలూరు : ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరం ప్రాజెక్టులో శుక్రవారం పర్యటించారు. గురువారం రాత్రి పోలవరం ప్రాజెక్ట్ అతిథి గృహంలో బస చేసిన ఆయన ఉదయాన్నే పర్యటన ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, డయాఫ్రమ్ వాల్, ఫిష్ లాడెర్ మొదలైన వాటిని పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రం పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్, జల విద్యుత్ కేంద్రం పనుల పురోగతి తదితర అంశాలపై శశిభూషణ్ కుమార్ సమీక్షించనున్నారు. కొద్ది రోజుల క్రితం శశిభూషణ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. శశిభూషణ్ వెంట పర్యటనలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సి ఈ ఓ సంజీవ్ వోహ్రా, చీఫ్ ఇంజనీర్ కే రమేష్ బాబు, ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, చీఫ్ ఇంజనీర్ కే నరసింహమూర్తి, ఎస్ ఈ ఆర్ రామచంద్ర రావు, నిర్మాణ సంస్థ జి ఎంలు ఏ గంగాధర్, ప్రసేన్జిత్ మజుందార్, డీజీఎం మురళి పమ్మి తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్