ప్రజాశక్తి-ముప్పాళ్ల (గుంటూరు) : పాఠశాల బస్సు కింద పడి రెండున్నర సంవత్సరాల వయస్సున్న బాలుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన మండలంలోని లంకెలకూరపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీ వద్ద జరిగింది. లంకెలకూరపాడు గ్రామానికి చెందిన కొడవటి రాజకుమారి పెద్ద కుమారుడు సిద్దార్థ్ మండల కేంద్రమైన ముప్పాళ్లలోని ఒక ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. ఈ క్రమంలో రోజులాగే ఉదయాన్నే సిద్దార్థ్ ను పాఠశాల పంపేందుకు బస్సు దగ్గరకు రాజకుమారి సిద్దార్థ్ తో పాటు తన రెండవ కుమారుడు నితిన్ ను కూడా తీసుకువెళ్ళింది. ఈ క్రమంలో సిద్దార్థ్ ను రాజకుమారి బస్సు ఎక్కిస్తుండగా నితిన్ తన తల్లి వద్ద నుంచి వచ్చి పాఠశాల బస్సు ముందుకు వెళ్ళాడు. ఇది గమనించని పాఠశాల బస్సు డ్రైవర్ నితిన్ ను గుద్దుకుంటూ తల మీదుగా బస్సు పోనివ్వడంతో నితిన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
పాఠశాల బస్సు కిందపడి బాలుడు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)