శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరులో 2 నెలల పసికందు కిడ్నాప్ కేసు ఛేదింపు!

5 గంటల క్రితం

kidnap.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 03:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పిల్లలు లేరని దంపతులే కిడ్నాప్‌కు పథకం!

ప్రజాశక్తి _గుంటూరు : గుంటూరులో అక్టోబర్ 30వ తేదీ రాత్రి తల్లి పక్కన నిద్రిస్తున్న రెండు నెలల పసికందును గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు అపహరించిన ఘటనలో లాలాపేట పోలీసులు కీలక పురోగతి సాధించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇందిరా ప్రియదర్శిని కాలనీకి చెందిన గంగానపల్లి శ్రీనివాస్, ఆయన భార్య శివపార్వతికి పిల్లలు లేకపోవడంతో పసికందును కిడ్నాప్ చేయాలని పథకం రచించారు. రోడ్లపై చెత్త ఏరుకునే వారి వద్ద నుంచి బాబును అపహరించాలని నిర్ణయించుకున్నారు. శ్రీనివాస్‌కు హెయిర్ కటింగ్ షాపులో పరిచయమైన ఆటో డ్రైవర్ జాథవత్ పండు నాయక్‌తో రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పండు నాయక్ తన స్నేహితులైన శివప్రసాద్ నాయక్, చిలకబత్తిన చంద్‌తో కలిసి పసికందును అపహరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కిడ్నాప్ కోసం నిందితులకు శ్రీనివాస్ అడ్వాన్స్‌గా రూ.58 వేల నగదు అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్