ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వద్దకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సాధనకై ఈనెల 15వ తేదీన ఉండవల్లి సెంటర్ నుండి సిపిఎం ఆధ్వర్యంలో మంగళగిరి జనగలం సామూహిక రాయబారం పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు అన్నారు. ఆదివారం మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో మంగళగిరి జనగలం సామూహిక రాయబార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ జీప్ జాతాను ప్రారంభించి మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో వివిధ రకాల భూముల్లో ఇల్లు వేసుకొని నివసిస్తున్న వారందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు నియోజకవర్గంలో 20వేల మందికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో వినతి పత్రాలు, నిరాహార దీక్షలు, కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడి చేసి దరఖాస్తులతో అధికారులకు అందజేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్ సీతానగరం వద్ద శిలాఫలకాన్ని కూడా వేయడం జరిగిందన్నారు. వాగ్దానాన్ని విస్మరించడంతో సిపిఎం ఆధ్వర్యంలో మంగళగిరి జనగలం సామూహిక రాయబార పాదయాత్ర ఉండవల్లి సెంటర్ నుండి ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణం నుండి వందలాదిమంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మంగళగిరి ప్రాంతంలో సర్వేనెంబర్ 7 లో భూమి ఉందని, రత్నాల చెరువులో ల్యాండ్ బ్యాంక్ కింద 50 ఎకరాలు భూమి ఉందని తెలిపారు. ఈ భూములను పట్టణంలో గల పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని అన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ మాట్లాడుతూ పట్టణంలో ఒక కుటుంబంలో రెండు, మూడు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని అన్నారు. వీళ్ళందరికీ ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రాజధానిలో ఇళ్ల స్థలాలు వేలాదిమందికి ఇవ్వడం జరిగిందని అన్నారు. అయితే వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని విమర్శించారు. ఆ ప్రభుత్వం ఇచ్చిన వారందరికీ స్థానికంగా ఉన్న ప్రాంతంలోనే ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఎం చలపతిరావు, మంగళగిరి ఎయిమ్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కే బుజ్జిబాబు, ఏ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా మంగళగిరిలో వివిధ సెంటర్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ నెల 15 న జనగళం సామూహిక రాయబారం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి : సిపిఎం జీప్ జాత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 12, 2026, 04:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)