ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఫ్యాప్టో రాష్ట్ర పిలుపు మేరకు ఈ నెల 14న నిర్వహించనున్న జిల్లా స్థాయి ధర్నా, ర్యాలీ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎల్.వి రామిరెడ్డి పిలుపునిచ్చారు. ధర్నా,ర్యాలీ లకు ఆదివారం ఎస్.పి అనుమతి తీసుకున్న అనంతరం అయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9 గంటలకు నరసరావుపేట గాంధీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఛైర్మన్‌ను నియమించడం, పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను ప్రకటించడం, 30 శాతం మధ్యంతర భృతి అమలు, 11వ పీఆర్సీ బకాయిలు చెల్లింపు, విద్యాశాఖలో కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డుల సేవలను సమర్థవంతంగా అమలు చేయడం, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం తదితర డిమాండ్ల సాధన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ ఎం.మోహన్‌రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం తగ్గించాలన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం, ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసి పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచడం, గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలల సొసైటీల ఉద్యోగులకు కూడా అదే వయోపరిమితి వర్తింపజేయడం, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కొనసాగించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ప్రధాన బి.సంపత్‌బాబు, కార్యదర్శిలు బి.శ్రీనివాసరావు, హెచ్‌ఎం అసోసియేషన్ నాయకులు ఆర్.గోవిందరాజులు, రామారావు, నాయకులు పమ్మి వెంకటరెడ్డి, ఏ. ఏమండీ, పివి భీష్మారావు, ఎస్.కె కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.
14 న ఫ్యాప్టో ధర్నాను జయప్రదం చేయాలి : ఉపాధ్యాయ సంఘాల పిలుపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 12, 2026, 05:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)