మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా) : తమకు న్యాయం చేయాలంటూ .... ఓ వ్యక్తి ఓటింగ్ ( ఫ్లెక్సీ పరంజ ) ను ఎక్కిన ఘటన శనివారం గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ లో జరిగింది. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన దేవాంగుల భార్గవ రాజు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తమ ఇంటి విషయమై సమస్యను పరిష్కరించాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కదిరి సిఐ నాగేంద్రబాబు తన సమస్యను పరిష్కరించకపోగా, తమను బెదిరిస్తున్నాడంటూ ... ఆవేదన వ్యక్తం చేసి మంగళగిరి టిడిపి సెంట్రల్ ఆఫీస్ సమీపాన ఉన్న ఓటింగ్ (ఫ్లెక్సీ పరంజ )ను ఎక్కాడు. సంఘటనా స్థలానికి మంగళగిరి రూరల్ సిఐ ఏ.వి బ్రహ్మం, సిబ్బంది చేరుకొని అతడికి నచ్చచెప్పి కిందికి దింపే ప్రయత్నం చేశారు.
న్యాయం కోరుతూ ... ఫ్లెక్సీ పరంజను ఎక్కిన వ్యక్తి
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 25, 2026, 12:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)