శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

06 అక్టోబర్, 2026

curent shock.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అచ్చంపేట(గుంటూరు) : మండలంలోని నిండు జర్ల గ్రామంలో కరెంట్‌ షాక్‌ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బత్తుల వెంకటేశ్వర్లు (35) మేకలు కాసేందుకు పొలానికి వెళ్లాడు. అక్కడ పొలానికి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌కు విద్యుత్‌ తీగలు అమర్చి ఉండటంతో వాటిని తాకిన వెంకటేశ్వర్లుకు విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్