మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రముఖ పారిశ్రామికవేత్త వేణుగోపాలరావు మృతి

1 గంట క్రితం

Prominent industrialist Venugopala Rao passes away.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : ప్రముఖ పారిశ్రామికవేత్త, సేవాతత్పరుడు పట్టణానికి చెందిన నూకల వెంకట వేణుగోపాలరావు (60) అమెరికాలో సోమవారం మృతి చెందారు. ఆయన నూకల రామకోటేశ్వరరావు టెక్స్టైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. గుంటూరు జిల్లాలోని చేబ్రోలు, రాజమండ్రి, తమిళనాడు ప్రాంతంలోని సేలంలో స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్స్ నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే ఆయన పలువురికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తన వ్యాపార సంస్థలలో ఉపాధి కల్పించారు. దాదాపు 22 సంవత్సరాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ అధ్యక్షులుగా, అలాగే గుప్తా కళాశాల కార్యదర్శిగా 15 సంవత్సరాల పాటు సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కు అత్యంత సన్నిహితులు. కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని తెనాలికి తీసుకొచ్చే పనిలో కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. ఆర్యవైశ్య సామాజిక వర్గాలలో పేరెన్నిక గల ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, పలు ఆర్యవైశ్య సంఘాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్