బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రమాదాలకు అడ్డా అడ్డ రోడ్డు...

1 గంట క్రితం

The crossroads—a hotspot for accidents...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 11:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రభుత్వం లక్షలు, కోట్లు ఎక్స్ గ్రేషియో ప్రకటిస్తున్నా మారని అధికారుల తీరు...

ఇరిగిన స్తంభాలు, వంకర్లు బోయిన సిగ్నల్ బోర్డులు..ఇది అడ్డరోడ్డు పరిస్థితి...


ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : ప్రమాదాలు జరుగుతున్నా లక్షల రూపాయల ఆస్తులు నష్టమౌతున్నా విలువైన ప్రాణాలు పోతున్నా లక్షలు, కోట్ల రూపా యల ఎక్స్గ్రే షియో ప్రభుత్వం చెల్లిస్తున్న మా కేందుకులే అని ఉన్నతాధికారుల అధికారులు మిన్నకుంటున్నారు. ఎలాంటి ప్రమాద నిరోధ చర్యలు తీసుకున్న పాపాన పోవటం లేదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి తప్ప ఆ తరువాత ముందస్తు జాగ్రత్తలు కానీ, శాశ్వత నివారణ చర్యలు కానీ తీసుకోవటం లేదు. ఆస్తులు పోలీస్ శాఖ వారు, ఆర్.టి.ఓ. శాఖ వారు, రో డ్లు భవనాల శాఖ వారు నిర్ణక్ష్యానికి, అభద్రతా భావానికి నిలువు సాక్ష్యాలు గా స్థానిక అడ్డరోడ్డు ఉంది. ప్రమాదాలకు అడ్డాగా మారిన ఈ సెంటర్లో విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు, పక్కకి వాలిపోయిన సి గ్నల్ బోర్డులు, వంకర్ల బోయిన వాహనాల వేగాన్ని తెలియజేసే బోర్డులు,అడ్డరోడ్డు సెంటర్లో ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో స్పీడు బ్రేకర్లు, జీబ్రాల గుర్తులు, ష్టిక్కర్లతో కూడిన హెచ్చరికలను, సీసీ కెమెరాలను పటిష్టంగా నిర్వహించాలని వాటి సంఖ్య ను పెంచి వెంటనే ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అంతే కాకుండా విరిగి పోయిన స్తంభాలను, సిగ్నల్ బోర్డులను సరిచేసి ఫ్లెక్సీలను తొలగించాలని ప్రజలు వాహన చోదకులు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్