గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

134 సర్వే నెంబర్లో భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలి

4 రోజుల క్రితం

gannavaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 02:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఈనెల 15వ తేదీన మంత్రి నారా లోకేష్ వద్దకు జరిగే రాయబార కార్యక్రమాన్ని జయప్రదం చేయండి..

ప్రజాశక్తి -మంగళగిరి : మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు వద్దగల 134 సర్వేనెంబర్ లో గల భూమిని ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు అన్నారు. ఆదివారం సిపిఎం మంగళగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రత్నాల చెరువులో గల ఖాళీగా ఉన్న భూమిని సిపిఎం నాయకులు సందర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే స్థలాలు లేవని ప్రభుత్వం చెబుతుందని, మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులో గల భూమిలో ఇవ్వవచ్చని అన్నారు. గతంలో కాండ్రు కమల నగర పేరుతో పేదలు ఇళ్లు వేసుకున్నారని అన్నారు. కాని అధికారులు మాత్రం ఇళ్లు తొలగించారని అన్నారు. అధికారులు మాత్రం ల్యాండ్ బ్యాంక్ కింద 50 ఎకరాలు ఉంచుతున్నట్లుగా తెలిపారని అన్నారు. 50 ఎకరాల భూమిని పట్టణంలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వచ్చని, ఈ అంశంపై మంత్రి నారాలోకేష్‌ దృష్టి పెట్టాలని సూచించారు. అయితే ఈ ప్రాంతంలో దళారులు ఆక్రమించి విక్రయించుకునేందుకు యత్నిస్తున్నారని అన్నారు. దళారుల చేతిలోకి భూమి పోకముందే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మంత్రి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని సీతానగరం వద్ద శిలాఫలకం వేశారని అన్నారు. 3000 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల అవుతున్నప్పటికీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సిపిఎం సీనియర్ నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ వద్దకు రాయబారం కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి పట్టణంలోని ఇళ్ల స్థలం లేని నిరుపేదలు, ఇళ్లు నిర్మించుకున్నవారు ఇళ్ల పట్టాల కొరకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ సభ్యులు ఇటికాల కాటమరాజు, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఎం చంద్ర రావు, ఎస్ గణేష్, ఎయిమ్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కే బుజ్జిబాబు, వివిధ ప్రజా సఘాల నాయకులు, ఎస్ విజయలక్ష్మి, ఏ రవికుమార్, ఎస్ వెంకటేష్, బి స్వామినాథ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్