మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తవ్వారు.. వదిలేశారు..

1 గంట క్రితం

They dug... and abandoned it.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : స్థానిక పెదసనందీపాడు రోడ్డులో మద్ది నగర్ దాటినా తరువాత రోడ్డు ప్రక్కనే మంచి నీటి పైప్ లైన్ కోసం గత పది పదిహేను రోజుల క్రితం తవ్వారు. పనులు పూర్తి అయ్యాయి. అయినప్పటికీ గుంతలను సక్రమంగా పూడ్చకపోవటంతో అక్కడ నివాస ప్రజలు రాక పోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్ కు చెప్పి గుంతలు పూడిపించాలని ప్రజలు కోరుతున్నారు. అసలే వర్షాకాలం అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. గుంతలలో నీటిలోతు తెలియక ప్రమాదాలు జరిగితే ఎవరు భాద్యులని పలువురు అడుగుతున్నారు. ముఖ్యంగా బురదలో వాహనాలు నడపలేకపోతున్నామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్