సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెరువులో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి

2 గంటల క్రితం

Two young men die after entering a pond to swim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 03:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పొన్నూరు (గుంటూరు) : పొన్నూరు పట్టణంలోని టిడ్కో గృహాల ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మంచినీటి చెరువులో ఈతకు దిగిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి, ఇద్దరి మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీశారు. మృతులను షేక్ షాజహాన్ (18), షేక్ సత్తార్ (16) గా గుర్తించారు. షేక్ షాజహాన్ ఓ ప్రైవేట్ కళాశాలలో మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతుండగా, షేక్ సత్తార్ పొన్నూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. చదువుకుంటూ ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు సాగాల్సిన వయసులో ఇద్దరు యువకులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న వయసులోనే యువకులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో టిడ్కో గృహాల ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్