ప్రజాశక్తి- తాడేపల్లి
ఉండవల్లి సెంటర్లో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 20వ తేదీ వరకు ఎంతో వైభవంగా జరగనున్న దసరా నవరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ను కమిటీ సభ్యులు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. దసరా పండగ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను వివరించిన సభ్యులు, ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. కమిటీ సభ్యుల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్ తప్పకుండా ఉత్సవాలకు హాజరవుతానని తెలిపారని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)