శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మాచర్లలో అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు

1 గంట క్రితం

మాచర్లలో అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 06:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మాచర్ల పట్టణంలోని 36 వార్డులకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాల జాబితా, భద్రతాపరమైన వర్గీకరణను అధికారులు విడుదల చేశారు. ఓటర్ల సంఖ్య, శాంతిభద్రతల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పోలింగ్‌ కేంద్రాలను హైపర్‌ సెన్సిటివ్‌, సెన్సిటివ్‌, సాధారణ కేంద్రాలుగా విభజించారు. ​పట్టణంలోని 1 నుంచి 7 వార్డుల పరిధిలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, మండల పరిషత్‌ మోడల్‌ ప్రాథమిక పాఠశాల (నెహ్రూనగర్‌), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కార్యాలయ భవనాలతోపాటు 22, 23, 24, 27 నుంచి 36 వార్డుల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 18, 19, 20 వార్డుల్లోని రోమన్‌ క్యాథలిక్‌ మిషన్‌ ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాల, 21వ వార్డులోని ఆర్‌ అండ్‌ బీ సబ్‌ డివిజన్‌ కార్యాలయం, 25వ వార్డులోని మున్సిపల్‌ కార్యాలయ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాల జాబితాలో చేర్చారు. 8 నుంచి 17 వార్డుల పరిధిలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, సెయింట్‌ ఆన్స్‌ బాలికల ఉన్నత పాఠశాల, ఎంపీడీవో కార్యాలయం, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రాలను సాధారణ కేంద్రాలుగా వర్గీకరించారు. అతి సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసు, ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనుంది. అదనపు భద్రతా చర్యలు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్