ప్రజాశక్తి – సింగనమల
సింగనమల మండలంలోని చిన్నమట్లగొంది గ్రామంలో బస్సు షెల్టర్ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. గ్రామానికి బస్సు షెల్టర్ అవసరాన్ని గుర్తించి, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా పార్నపల్లి రమేష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.2021 సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామానికి బస్సు షెల్టర్ నిర్మిస్తానని రమేష్ హామీ ఇచ్చారు. ఆ హామీని కార్యరూపంలోకి తీసుకురావడానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ద్వారా రూ.5 లక్షల నిధులు సమకూరగా, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సహకారంతో నిర్మాణ పనులు పూర్తయ్యాయి.మౌలిక వసతుల కల్పనపై దృష్టిగ్రామంలో సీసీ రోడ్లు, గోకులం షెడ్లు, ఉద్యాన పంటల అభివృద్ధి వంటి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.వాటర్ ట్యాంకు వద్దకు వెళ్లేందుకు మెట్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించిన రమేష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో మెట్ల ఏర్పాటు జరిగినట్లు గ్రామస్తులు వివరించారు.గ్రామస్తుల అభినందనలుగ్రామ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకత్వం గ్రామానికి అవసరమని అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లోనూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తే చిన్నమట్లగొంది మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు.







కామెంట్లు (0)