ప్రజాశక్తి - కర్నూలు కల్చరల్ : సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో డిసెంబర్ 12, 13 వ తేదీలలో రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ తెలిపారు. కర్నూలు నగరంలోని సాహితీ స్రవంతి ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బసవరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు సాహిత్య సమ్మేళనాలు రెండు రోజులపాటు విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహించామని, ఈ క్రమంలోనే కర్నూలులో నిర్వహిస్తున్నామని వివరించారు. సాహిత్య సమ్మేళనంలో తొలిరోజు రచయితల తాత్విక దృక్పథం, సాహిత్యంలో వస్తుశిల్ప సంబంధాలు, ప్రాచీన తెలుగు కవుల కవిత్వ దృక్పథం, ఆధునిక తెలుగు కవుల కవిత్వదృక్పథం, తెలుగు కవిత్వం - పుట్టుక -పరిణామం తదితర అంశాలపై విస్తృతమైన చర్చ చేయనున్నామన్నారు. ఇందులో భాగంగానే కొత్తగా రాస్తున్న రచయితలతో సృజనకారుల స్వరాలు పేరుతో ఒక సెషన్ నిర్వహిస్తామని చెప్పారు. రెండోరోజు సాహిత్య సమ్మేళనంలో బసవణ్ణ ప్రవచనాలు, సామాజిక దృక్పథం, రాయలసీమలో నవల, రాయలసీమలో కవిత్వం, రాయలసీమ కథ పేరుతో సెషన్లు జరుగుతాయని, రెండో రోజు కూడా సృజనకారుల స్వరాలు పేరుతో ఒక సెషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సాహిత్య సమ్మేళనానికి రాష్ట్రవ్యాప్తంగా కవులు, రచయితలు, సృజనకారులు భారీ ఎత్తున హాజరవుతారని చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్, నగర అధ్యక్షులు ఆకెపోగు నాగరాజు ప్రసంగించారు.
డిసెంబర్ 12, 13 తేదీల్లో కర్నూలులో రాష్ట్రస్థాయి సాహిత్య సమ్మేళనం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 07:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)