శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అసిస్టెంట్ కమిషనర్

1 గంట క్రితం

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అసిస్టెంట్ కమిషనర్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 06:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​భీమిలి డివిజన్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని అదనపు అసిస్టెంట్ కమిషనర్ అన్నైపు నరసింహమూర్తి శుక్రవారం సందర్శించి పరిశీలించారు.1 నుంచి 5 వరకు వార్డుల నామినేషన్ల స్వీకరణకు భీమిలి జీవీఎంసీ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు నామినేషన్ల హడావిడి పెద్దగా కనిపించలేదు.నామినేషన్ స్వీకరణ కేంద్రం సమీపంలో అనుసరించాల్సిన పద్ధతులు, భద్రతా ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ విధానాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో మధురవాడ ఏసీపీ, భీమిలి ఎస్ఐ గౌరీ, భీమిలి ట్రాఫిక్ ఎస్ ఐ తిరుపతిరావు జీవీఎంసీ కమిషనర్ ఎం.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్