ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరు మేయర్‌‌ స్థానంపై పీటముడి

1 రోజు క్రితం

గుంటూరు మేయర్‌‌ స్థానంపై పీటముడి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 11:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలిదశలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై టిడిపి, వైసిపి అగ్రనాయకత్వం శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు కసరత్తు కొనసాగించింది. మేయరు, చైర్మన్‌ అభ్యర్థుల ఖరారులో జాప్యం వల్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్‌ అభ్యర్థుల ఎంపికలో కూడా జాప్యమైనట్లు తెలుస్తోంది. కూటమిలో మున్సిపల్‌ పట్టణాల్లో వార్డుల విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. 20 నుంచి 25 శాతం వరకు వార్డులు జనసేనకు ఇవ్వడానికి టిడిపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బిజెపికి ఐదు శాతం ఇస్తారని తెలిసింది. టిడిపి ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగా ఇంత వరకు అధికారికంగా టిడిపి నాయకత్వం విడుదల చేయలేదు.


వైసిపి నియోజకవర్గ ఇన్‌‌ఛార్జిలు కూడా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎంపిక ప్రక్రియలో తలమునకలై ఉన్నా జాబితాలను శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు విడుదల చేయలేదు. వైసిపి తెనాలి, మాచర్ల, గురజాల, దాచేపల్లి చైర్మన్‌ అభ్యర్థులను గురువారం విడుదల చేయగా తాజాగా రెండో జాబితాలో గుంటూరు మేయర్‌గా తాడికొండ అలివేలు వెంకట నాగ పద్మ శ్రీదేవిని ఎంపిక చేశారు. చిలకలూరిపేట మున్సిపల్‌ చైర్‌‌పర్సన్‌ ‌స్థానానికి వైసిపి అభ్యర్థిగా షేక్ కరీమూన్‌‌ను ఎంపిక చేశారు. మాజీ కౌన్సిలర్ యూసుఫ్ అలీ సతీమణి షేక్ కరీమూన్‌‌ను ఎంపిక చేసినట్టు మాజీ మంత్రి విడదల రజనీ కార్యాలయం తెలిపింది. చిలకలూరిపేట జనసేన అభ్యర్థిగా బైరా పావనిని ఎంపిక చేసినట్టు తెలిసింది. గుంటూరు మేయర్‌‌పై టిడిపిలో ఏకాభ్రిపాయం కుదరలేదు. టిడిపి ఎమ్మెల్యేలు కోవెలమూడి లక్ష్మి అపర్ణను వ్యతిరేకరించినట్టు తెలిసింది. ప్రధానంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవికి కోవెలమూడి రవీంద్రకు ఉన్న విభేదాల నేపథ్యంలో అపర్ణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకరించినట్టు తెలిసింది. దీంతో కోవెలమూడి రవీంద్ర అభ్యర్థిత్వం పెండింగ్‌‌లో ఉంచారు. కోవెలమూడికి ప్రత్యామ్నాయంగా గుంటూరుకు చెందిన రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌‌పర్సన్‌ ‌రాయపాటి శైలజ పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. పార్టీ సీనియర్‌ ‌నాయకుడు యాగంటి అలేఖ్య పేరు కూడా పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం వరకు ప్రచారంలో ఉన్న డేగల భువనేశ్వరి, మాదల మీనారత్న పేర్లను కూడా పెండింగ్‌‌లో పెట్టారు. గుంటూరు మేయర్‌ అభ్యర్థి ఎంపికపై సిఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రి పెమ్మసానిని పిలిచి చర్చించారు. టిడిపి నుంచి మాచర్ల మున్సిపల్‌ ‌చైర్‌‌పర్సన్‌ అభ్యర్థిగా ఎనుమల సుష్మ, గురజాల నుంచి నెలవల్లి బొల్లయ్య, దాచేపల్లి నుంచి తంగెళ్ల శ్రీనివాసరావును ఎంపిక చేస్తూ టిడిపి అధిష్టానం శుక్రవారం రాత్రి 11 గంటలకు జాబితాను విడుదల చేసింది. వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మున్సిపాల్టీలకు చైర్మన్‌ ‌అభ్యర్థుల‌ను ఇంకా ఎంపిక చేయలేదు. తెనాలిలో జనసేన అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్