శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిసెంబర్‌ 22న ఎస్ఐఆర్ తుది జాబితా ఎమ్మెల్సీ ఓటు నమోదుకు మరో అవకాశం

18 నవంబర్, 2026

డిసెంబర్‌ 22న ఎస్ఐఆర్ తుది జాబితా
ఎమ్మెల్సీ ఓటు నమోదుకు మరో అవకాశం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 06:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్)లో భాగంగా తుది జాబితాను డిసెంబరు 22న విడుదల చేస్తామని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారం ఇంకా అందించని వారు, ఇళ్లు మారిన వారు, డూప్లికేట్, డిసీజ్డ్ (ఎ, ఎస్, డి, డి) జాబితాలో ఉన్న 2.37 లక్షల మంది మాత్రం నవంబరు 30వ తేదీ లోపు సమర్పించవచ్చని చెప్పారు. కొత్త వారి నుండి తీసుకోబోమని స్పష్టం చేశారు. డిసెంబరు 10వ తేదీలోగా విచారణలు పూర్తి చేసి అర్హులను జాబితాలో చేరుస్తామన్నారు.


​డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరుగా నమోదు కావడానికి డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం ఉంటుందని గుంటూరు - కృష్ణా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇఆర్ఓ, డిఆర్‌ఒ ఖాజావలి తెలిపారు. ఫిబ్రవరి 2న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని చెప్పారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలలో పనిచేస్తున్న ఉన్నత పాఠశాలు, ఆపై స్థాయిలో బోధనలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటరుగా నమోదు కావడానికి అర్హులని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్థానిక నివాసం ఉన్నప్పుడు మాత్రమే ఓటరుగా అర్హులని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 15 వేల దరఖాస్తులు అందాయని, మొత్తం 19 వేల మంది వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా పని చేస్తున్నట్లు అంచనా ఉందని చెప్పారు.


​​ప్రతి పోలింగ్ కేంద్రంలో సిసి కెమెరా..

పట్టణ, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని జెసి తెలిపారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ, పొన్నూరు పురపాలక సంఘంలో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యిందని, గురువారం ఉపసంహరణలు ఉంటాయని, అనంతరం తుది జాబితా ప్రకటన ఉంటుందని తెలిపారు. ఈనెల 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. అదేవిధంగా పంచాయతీలకు సంబంధించి జిల్లాలో రెండు, మూడు దశలలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నుండి కె.కె.గుప్తా, టిడిపి కంచర్ల శివరామయ్య, ఆప్‌ ‌నుండి డాక్టర్‌ ‌టి.సేవాకుమార్, బిఎస్‌‌పి నుండి సిహెచ్‌‌.వాసు, సిపిఎం నుండి కృష్ణకాంత్, వైసిపి నుండి పిచ్చిరెడ్డి, జనసేన నుండి త్రినాథ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్