శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలికలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించడం బాధ్యత బీసీవీ రాష్ట్ర అధ్యక్షులు శివరామకృష్ణ

19 నవంబర్, 2026

బాలికలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించడం బాధ్యత
బీసీవీ రాష్ట్ర అధ్యక్షులు శివరామకృష్ణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలికలకు సురక్షితమైన వాతావరణం కల్పించి, విద్యావకాశాలు అందించి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని హైకోర్టు న్యాయవాది, బహుజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శివరామకృష్ణ అన్నారు. గుట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఆర్డీటీ ఆధ్వర్యంలో ‘మై డే, మై రైట్స్, మై ఫ్యూచర్’ (నా రోజు, నా హక్కులు, నా భవిష్యత్తు) అనే కార్యక్రమం ద్వారా బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో చట్టం-2012), బాల్య వివాహాల నిరోధక చట్టం(2006) తదితర చట్టాల గురించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించారు. మహిళలు, బాలికల రక్షణ, సంక్షేమం కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ చట్టాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగార్జున, బహుజన చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఆర్డీటీ మడకశిర ప్రాంతీయ డైరెక్టర్ మల్లికార్జున, హైకోర్టు ఎడ్యుకేటర్ రమా పవన్ రాయల్, పెనుకొండ ఏరియా ఇన్‌చార్జి రాజారత్నం, పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ శాఖ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్