శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

18వ డివిజన్లో సిపిఎం అభ్యర్థి విస్తృత ప్రచారం..

19 నవంబర్, 2026

18వ డివిజన్లో సిపిఎం అభ్యర్థి విస్తృత ప్రచారం.. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి మంగళగిరి

ఈనెల 26వ తేదీన జరిగే ఎంటిఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో 18వ డివిజన్ కు సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉయ్యాల తిరుపతమ్మ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం రాత్రి మంగళగిరి పట్టణంలోని శివాలయం వీధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతంలో సిపిఎం కౌన్సిలర్ గా అనేక పర్యాయములు గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిని కార్పొరేటర్ గా గెలిపించాలని ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎస్ ఎస్ చెంగయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ, స్థానిక సిపిఎం నాయకులు ఎస్ వెంకటేష్, ఎస్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్