మాచర్ల మండల పరిషత్ నూతన అధ్యక్షునిగా కంభంపాడు-2 బోయ గోపిరెడ్డి ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి బి.నారదముని అధ్యక్షతన గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నిక నిర్వహించగా గోపిరెడ్డికి మద్దతుగా ఎంపిటిసీలంతా మద్దతు ప్రకటించగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్ ఎంపిపిగా సింగిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. తొలుత మండలంలోని 14 మంది ఎంపీటీసీ సభ్యులతో రిటర్నింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ని ప్రకటించి, ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన ఎంపిపి గోపిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవిని కేవలం హోదాగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా పనిచేస్తానని అన్నారు. అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని, రహదారులు, తాగునీరు, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందేలా పనిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్ధార్ కిరణ్ కుమార్, ఎంపిడిఒ సత్యనారాయణ, జెడ్‌పిటిసి జి.శ్రీనివాస్ యాదవ్, మాచర్ల 18వ వార్డు కౌన్సిలర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి (బుల్లిరెడ్డి), ఇతర నాయకులు పాల్గొన్నారు.










కామెంట్‌లు (0)