శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తాను

19 నవంబర్, 2026

ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తాను image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - చేబ్రోలు

మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం వేజెండ్ల -1 ఎంపీటీసీ సభ్యునిగా ముంతాజ్ బేగం షేక్ గురువారం చేబ్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో ఎన్నిక కావడానికి సహకరించిన గ్రామ ప్రజలకు ఓటర్లకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్థానిక శాసనసభ్యులు సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తాను అన్నారు . నేటి నుండి ప్రజా ప్రతినిధిగా మండల పరిషత్ సమావేశాలకు విధిగా హాజరై గ్రామ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అన్నారు . గ్రామంలో అభివృద్ధి , మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులతో సమన్వయం చేసుకుని పని చేస్తానని అన్నారు . గ్రామంలో అభివృద్ధి పనుల మంజూరుకు పరిపాలనాపరమైన అనుమతులకు అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి చేసుకొని కృషి చేస్తాను అన్నారు .

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్