ప్రజాశక్తి - తెనాలి
మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. రిటర్నింగ్ అధికారి డి దుర్గాబాయి అధ్వక్షతన మండల పరిషత్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశమయ్యారు. మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాల నుంచి గెలుపొందిన వారితో రిటర్నింగ్ అధికారి ప్రమాణస్వీకారం చేయించారు. కూటమిలో టిడిపి నుంచి అంగలకుదురు-1 షేక్ సుభాని, అంగలకుదురు-2 మున్నంగి సుబ్బారావు, గుడివాడ పాటిబండ్ల ప్రియాంక, హాఫ్‌పేట దర్శి రతనకుమారి, కొలకలూరు-1 షేక్ అజీజ్, కొలకలూరు-2 దాది పద్మావతి, కోపల్లె కట్టా సాంబశివరావు, మల్లెపాడు బొంత లలిత, నందివెలుగు-2 నంద లక్ష్మి, తేలప్రోలు సయ్యద్ రజియా బేగం, అలాగే జనసేన నుంచి బుర్రిపాలెం కోడూరు రాజేష్‌బాబు, జగ్గడిగుంటపాలెం గోలి శ్రీనివాసరావు, కంచర్లపాలెం కత్తి మౌనిక, కఠెవరం-2 కడిమెళ్ళ భార్గవి, కొలకలూరు-3 తోట నరేంద్ర, కొలకలూరు-4 పొన్నకంటి చక్రవర్తి, నందివెలుగు-1 ఎగ్గోలు సాంబశివరావు, పెదరావూరు-1 కొడాలి శ్రీనివాసరావు, పెదరావూరు-2 జాస్తి గాయత్రి, కఠెవరం-1 నుంచి వైసిపి అభ్యర్థి కరుణ రాజ్యలక్ష్మి, సంగం జాగర్లమూడి నుండి స్వతంత్ర అభ్యర్థి వరద రామాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు.
అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక...
మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఎలక్షన్ కమిషన్ వాయిదా వేయడంతో నేరుగా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికను రిటర్నింగ్ అధికారి డి.దుర్గాబాయి నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షునిగా పెదరావూరు-1 స్థానం నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన కొడాలి శ్రీనివాసరావును కొలకలూరు నాలుగవ సెగ్మెంట్ ఎంపిటిసి పొన్నెకంటి చక్రవర్తి ప్రతిపాదించగా, కొలకలూరు 3 ఎంపిటిసి తోట నరేంద్ర బలపరిచారు. అదేవిధంగా అంగలకుదురు-1 స్థానం నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన షేక్ సుభానిని ఉపాధ్యక్షులుగా గుడివాడ ఎంపిటిసి పి.ప్రియాంక ప్రతిపాదించగా, తేలప్రోలు ఎంపిటిసి రజియా బేగం బలపరచారు. ఎంపిపి కొడాలి శ్రీనివాసరావు కు 21 మంది సభ్యులూ చేతులెత్తి మద్దతు తెలుపగా, ఉపాధ్యక్షులు షేక్ సుభాని అభ్యర్థిత్వాన్ని 20 మంది ఎంపీటీసీలు చేతులు ఎత్తి మద్దతు తెలిపారు. దీంతో రిటర్నింగ్ అధికారి మండల పరిషత్ అధ్యక్షులుగా కొడాలి శ్రీనివాసరావును, ఉపాధ్యక్షులుగా షేక్ సుభానిని ప్రకటించి, ధ్రువీకరణ పత్రాలను అందించి వారితో ప్రమాణస్వీకారం చేయించారు.










కామెంట్లు (0)