శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన ఫార్మసీ వారోత్సవాలు

5 రోజుల క్రితం

ముగిసిన ఫార్మసీ వారోత్సవాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తెనాలి

స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ఏ.ఎస్.ఎన్. ఫార్మసీ కళాశాలలో ఐపిఎఎస్ఎఫ్ ఎఎస్ఎన్ ఛాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 65వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. 'ఎంపవరింగ్ ఫార్మసిస్ట్స్ ఫర్ హెల్తియర్ ఫ్యూచర్' నినాదంతో నవంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెనాలి డ్రగ్ ఇన్‌‌స్పెక్టర్‌ జె. వినోద్ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులకు ఉన్నత విద్యలో జీప్యాట్, నైపర్ ప్రవేశ పరీక్షల ప్రాముఖ్యత, వాటి ద్వారా లభించే అవకాశాలను వివరించారు. విద్యార్థులు ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అదేవిధంగా డ్రగ్ అబ్యూస్ (మాదకద్రవ్యాల దుర్వినియోగం) వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాజంలో వాటిపై అవగాహన కల్పించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ అన్నాబత్తుని సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతో పాటు సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వెంకటరమణ మాట్లాడారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్విజ్, ఫార్మకాలజీ మోడల్ ఎగ్జిబిషన్, అంత్యాక్షరి, డంబ్ చరేడ్స్, రంగోలి, ఓరల్ అండ్ కేస్ ప్రజెంటేషన్స్ పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ముఖ్యఅతిథిని కళాశాల బృందం సత్కరించింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ -1 , 2 ప్రోగ్రామ్ ఆఫీసర్లు కె. కళ్యాణ్ చక్రవర్తి, జి. నంద గోపాలకృష్ణ, ఐపిఎ ఎఎస్ఎన్ చాప్టర్ మెంటార్ పి. భార్గవి పర్యవేక్షించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్