మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జొన్నాడలో ఘనంగా ఉయ్యాలవాడ జయంతి వేడుకలు

15 నిమిషాల క్రితం

Uyyalawada birth anniversary celebrations held grandly in Jonnada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 02:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఆలమూరు (కోనసీమ) : మండలంలోని జొన్నాడలో మంగళవారం వేమన రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేసిన తొలి తెలుగు వీరుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేమన రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్