ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని 18 గ్రామాల్లో రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పెనికేరు సర్పంచ్ ఈదల శ్రీ రామచంద్రమూర్తి(చినబాబు), సంధిపూడి సర్పంచ్‌గా దొడ్డా సుబ్బారావు, రెండు గ్రామాల వార్డు సభ్యులతో సహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి వివరాలు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. పెనికేరు సర్పంచ్ గా ఈదల చినబాబు, వార్డు సభ్యులుగా గుడాల దేవి, కాటూరి రామకృష్ణ, గోపు గోపాలకృష్ణ, ఏడిద గోపాలకృష్ణ, పెనుగొండ సూర్యకుమారి, వనచర్ల దుర్గమ్మ, పాకా సాయికుమార్, కొమ్ము నారాయణుడు, గుడాల ప్రమీల, బొక్కా నాగ మణి, గుత్తుల వెంకటలక్ష్మి, మోరంపూడి కొండమ్మ ఏకగ్రీవం అయ్యారు. సంధిపూడి సర్పంచ్‌గా దొడ్డా సుబ్బారావు, వార్డు సభ్యులుగా సూరపురెడ్డి దుర్గ, గుండుబోగుల వెంకటలక్ష్మి, తమ్మన లలిత, అబ్బిరెడ్డి సత్యవెంకట రామకృష్ణ, గుత్తుల మురళీదుర్గాప్రసాద్, తోరాటి వీరబాబు, బొర్రాసత్యనారాయణ, సూరపురెడ్డి సత్యవేణి, పామర్తి పుల్లయ్య, గుత్తుల దుర్గా ఎన్నికయ్యారు.
పెనికేరు, సంధిపూడి సర్పంచ్‌లు ఏకగ్రీవం - వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం
17 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026, 02:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)