శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాలకవర్గాల దోపిడీ విధానాలపై యువత ఉద్యమించాలి : కె ఎస్ లక్ష్మణరావు

23 ఆగస్టు, 2026

Youth must agitate against the exploitative policies of the ruling classes: K.S. Lakshmana Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 05:29 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సరఫరా చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి..

యువతకు ఉపాధి కల్పించాలి..


ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పాలకవర్గాలు అవలంబిస్తున్న దోపిడీ విధానాలపై యువత ఉద్యమించాలని మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు అన్నారు. డివైఎఫ్ఐ గుంటూరు జిల్లా 14వ మహాసభ ఆదివారం మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులో గల సింహాద్రి శివారెడ్డి కళ్యాణ మండపంలో ఎం భాగ్యరాజు నగర్ లో జరిగింది. మహాసభకు అధ్యక్ష వర్గంగా ఎస్ గణేష్, ఎం ప్రసన్నకుమార్ వ్యవహరించారు. లక్ష్మణరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ జాతీయ ఉద్యమంలో యువకులు కీలకపాత్ర పోషించారన అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజులు ఉద్యమించారని అన్నారు. వారి పోరాటాల ఫలితమే పోరాటాల ఫలితమే స్వాతంత్రం భారతదేశానికి వచ్చిందని అన్నారు. ఇటీవల భారత దేశంలో జన్ జెడ్ ఉద్యమం జరిగిందని అన్నారు. భారత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలతో ఏర్పడిన సిజేపి పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష లీకై 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా జరిగిన ఉద్యమం యువకుల్లో తీవ్రమైన మార్పు తీసుకొచ్చిందని అన్నారు. ఢిల్లీ పోలీసులు, సిఆర్పిఎఫ్ దళాలు దుర్మార్గంగా ఇరుసుకుపడి వేలాది మందిని లాఠీలతో చితకబాది, వందల మందిపై బాష్ప వాయువు ప్రయోగించి యువతి యువకులను పెల్లేట్ గనులతో గాయపరిచారని అన్నారు. అయినప్పటికీ యువత దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వ మెడలు వచ్చిందని అన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కొరకు యువత ఉద్యమిస్తుందని అన్నారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతుందని అన్నారు. డ్రగ్స మాఫియా వలన యువత చెడు మార్గంలో ఉందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా యువత ఉద్యమిస్తూ నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ మాఫియా దాడిలో హత్య గురి కావడం జరిగింది అని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య రోజు పెరుగుతుందని అన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ యువతను మతం, కుల, ప్రాంతీయ తత్వాలతో చీల్చ దానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. వీటికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు మంత్రి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా యువతి, యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేశారని అన్నారు. నిరుద్యోగ భృతి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ పేరుతో పోస్టులను భర్తీ చేశారు తప్ప, మరి నోటిఫికేషన్ ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఉపాధి కల్పిస్తామని దానితో రాష్ట్రంలో ఉన్న భూములను పెట్టుబడిదారులకు విచ్చలవిడిగా ఇస్తున్నారని విమర్శించారు. లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్పడమే తప్ప ఆచరణలో కనబడడం లేదని అన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై రాము మాట్లాడుతూ గంజాయి రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని ప్రభుత్వం ప్రకటిస్తుందని అన్నారు. అద్దంకిలో ఇటీవల పోలీస్ వాహనంలో గంజాయి తరలిస్తున్న సంఘటనలు బయటకు వచ్చాయని అన్నారు. దీన్నిబట్టి గంజాయి అరికట్టే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. అద్దంకిలో జరిగిన ఘటనపై ప్రభుత్వ విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అమరావతి రాజధానిలో యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని విమర్శించారు. ప్రతిరోజు ప్రభుత్వం యువతకు మాయమాటలు చెప్పి యువతను మోసగిస్తుందని అన్నారు. ఉద్యోగాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు, ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. పాలకుల విధానాలపై యువత ఉద్యమించాలి పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి వై కృష్ణ కాంత్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టి మాట్లాడారు. అమరావతి రాజధాని ప్రాంతంలో స్థానికంగా ఉండే నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లేదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుండి పనులు చేయించుకుంటున్నారని అన్నారు. రాజధాని ప్రాంతంలోని యువతకి రాజధాని నిర్మాణంలో ఎటువంటి పాత్ర లేకపోవడం దారుణమైన అన్నారు. స్థానికులకు విద్యలోనూ, ఉపాధిలోను అవకాశాలు కల్పిస్తామని సి ఆర్ డి ఏ చట్టం లోనే ఉన్నప్పటికీ అమలకు నోచుకోలేదని విమర్శించారు. స్థానిక యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి, కనీస వేతనాలు అమలు జరిపి అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. రాజధానిలో యువతకు ఉపాధి కల్పనకు యువత సంఘటితమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం మహాసభలో పలు తీర్మానాలను సుగుణ కుమార్ ప్రవేశపెట్టి మాట్లాడారు. మతోన్మాద వ్యతిరేక యూత్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ మాఫియా కి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ ఉద్యమించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన చేయాలని తీర్మానించడం జరిగింది. ఇంకా ఈ మహాసభలో డివైఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి ఈమని అప్పారావు, సిఐటియు నాయకులు ఎం బాలాజీ, ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి షేక్ సమీర్ పాల్గొన్నారు.అనంతరం ఎనిమిది మందితో నూతన కమిటీ ఎన్నికయింది. నూతన డివైఎఫ్ఐ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఎస్ గణేష్, కార్యదర్శిగా వై కృష్ణ కాంత్, ఉపాధ్యక్షులుగా ఎం ప్రసన్నకుమార్, జిల్లా సహాయ కార్యదర్శిగా డి కృష్ణ కేశవ్, సభ్యులుగా ఎం రాంబాబు, ఎస్ గోవింద్, టి వేణుగోపాల్, మహేష్ ఎన్నికయ్యారు. తొలుత డివైఎఫ్ఐ పతకాన్ని డివైఎఫ్ఐ మాజీ నాయకులు ఎం నాగేశ్వరావు ఆవిష్కరించారు. ఇటీవల మృతి చెందిన ఎం భాగ్యరాజ్ చిత్రపటానికి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న పూలమాలవేసి నివాళులర్పించారు. గత మహాసభ నుండి ఈ మహాసభ వరకు అమరులైన వారికి మహాసభ సంతాపం తెలియజేసింది.

Youth must agitate against the exploitative policies of the ruling classes: K.S. Lakshmana Rao


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్