వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’ అక్టోబర్ 2న ముందుగా ప్రకటించిన తేదీకే విడుదల కానుంది. సినిమా ఆలస్యంగా విడుదలవుతుందంటూ వచ్చిన వార్తలపై నిర్మాత నాగవంశీ స్పందించారు. విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. రాబోయే నెలరోజులు వరుసగా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని, వచ్చేవారం మొదట్లో టీజర్, ఆ తర్వాత ఫస్ట్ సింగిల్, చివరి వారంలో ట్రైలర్‌ను విడుదల చేస్తామని తెలిపారు. వెంకటేష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 2నే ‘ఆదర్శ కుటుంబం’ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 07:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)